Laahe Laahe Song Lyrics In Telugu - Aacharya | లాహే లాహే | Chiranjeevi | Ram charan |
Laahe Laahe Song Lyrics In Telugu చిత్రం : ఆచార్య పాట : లాహే లాహే లాహే లాహే సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి గానం : హారిక నారాయణ్, సాహితీ చాగంటి సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు బంగరుకొండ కొండజాతికి అండదండ మద్దెరాతిరి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. మెళ్ళో మెలికల నాగులదండ వలపుల వేడికి ఎగిరిపడంగా ఒంటి ఇబుది జల జల రాలిపడంగ సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరికురులు ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు వెన్నెలకాసిందే పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే ఉభలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కలికి ఎందా సెంకం ...