KOMURAM BHEEMUDO TELUGU LYRICS - RRR | కొమురం భీముడో | NTR | Ram Charan |
Komuram Bhimudo Song Lyrics In Telugu చిత్రం: RRR పాట: కొమురం భీముడో దర్శకుడు: S.S రాజమౌళి గానం: కాళ భైరవ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ సంగీతం: M.M. కీరవాణి కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో కొమురం భీముడో .. కొమురం భీముడో రగరాక సురీడై రగలాలి కొడుకో.. రగలాలీ కొడుకో.. కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల.. కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో.. జులుము గద్దెకు తలను ఒంచితోగాలా.. జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..పెరగానట్టేరో కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల.. సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో.. కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో కాలువై పారే నీ గుండె నెత్తురు నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మకాళ్ల పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమురం భీముడో.. కొమురం భీముడో.. పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో Komuram Bhimudo Song Lyrics I...