Posts

Showing posts from January 27, 2022

Cheppamma Cheppamma Song lyrics - Murari | Mahesh Babu | Sonali Bendre | Krishna Vamshi

Image
»  HOME » MURARI All SONGS Cheppamma Cheppamma Murari Movie Song Lyrics In Telugu పాట : చెప్పమ్మా చెప్పమ్మా చిత్రం : మురారి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : K.S చిత్ర సంగీతం : మనీశర్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వంటే మరీ అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలాన అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం వెంట తరుముతున్నవేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటు చూసిన చెంప గిల్లి పొతావేంటి గాలి వేలితోన అంత గొడవపెడతావేంటి నిద్దరోతు ఉన్న అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్న ఒంటిగ ఉండనీ వెంటి ఒక్క నిముషమైన ఇదేం అల్లరి భరించేదేల అంటూ నిన్నేల కసరనూ నువ్వేంచేసినా బాగుంటుందనే నిజం నీకెలా చెప్పనూ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మోమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైన ఏడిపించబుద్దెతుంది ఎట్టాగైన ముద్దుగానే ఉంటా...